Wednesday, 25 February 2015

1) ఊరి పేరు: మోరి    2) మండలం: సఖినేటిపల్లి   3) మా ఊరి సరిహద్దులు: అంతర్వెదిపలెం, మలికిపురం.,    శృంగవరప్పాడు.   4) ఊరి దగ్గరలోని పట్టణం: మలికిపురం     5) ప్రధాన పంటలు: వరి., చెరకు.    6) పాఠశాలలు, కాలేజీలు: ఎలిమెంటరీ స్కూలు., శ్రీమతి జాన సుబ్బమ్మ మెమోరియల్ హైస్కూల్.  7) ప్రధాన ఆలయాలు: శివాలయం., రామాలయం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం., శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం., శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం., శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం. 8)  మా ఊరి ప్రట్యేకతలు:  మోరి గ్రామం జీడిపప్పు పరిశ్రమకు, చేనేత పరిశ్రమకు ఎంతో ప్రశిద్ధి  చెందినది. అన్నివర్గాల ప్రజలు సామరస్యంతో జీవనం సాగిస్తారు. ఇచ్చటి   ప్రజలు చాల కష్టపడి   పనిచేయటమే కాకుండా అందరికీ ప్రేమపాత్రులుగా ఉంటారు. మోరి చేనేత సంఘంలో తయారయ్యే  చేనేత వస్త్రాలు ఎంతో పేరు ప్రఖ్యాతులు  కలిగి ఉన్నాయి.  ఇక్కడ శ్రీ నాగయ్య పుస్తక భాండాగారం ప్రసిద్ది చెందిన గ్రంధాలయం. 9)  శ్రీ జాన శంకరయ్య గారి కుటుంబసభ్యులు ఎన్నో దానధర్మాలు చేసి మోరి అభిరుద్ధికి  తోడ్పడినారు.  హైస్కూల్, ఆసుపత్రి వంటివి  నిర్మించటంలో   ఎంతో సహకారాని అందించినారు. శ్రీ ముప్పర్తి వారు, శ్రీ ఎనుముల వారు, శ్రీ పిండి వారు, శ్రీ వలవల వారు, శ్రీ దొడ్డా వారు, శ్రీ జక్కంపూడి వారు, శ్రీ బొల్లాప్రగడ  వారు, శ్రీ గోపరాజు వారు, శ్రీ చెట్లపల్లి వారు,  శ్రీ చింతపట్ల వారు, శ్రీ చింతా వారు, శ్రీ ఉప్పుగంటి వారు, శ్రీ లక్కింశెట్టి వారు, శ్రీ జాన వారు, శ్రీ కుందెం వారు, శ్రీ పిచ్చిక వారు, శ్రీ  కటకం వారు,  శ్రీ కారుపర్తి వారు, శ్రీ భట్టు వారు, శ్రీ బళ్ల వారు, శ్రీ గుమ్మడి వారు, మొదలైన  ఎంతో మంది ప్రముఖులకు మోరి గ్రామం నివాస స్థానమైనది. (అందరి పేర్లు వ్రాయలేకపోయినందులకు  మన్నించండి.).  10) మాఊరి చరిత్ర: పూర్వం ముస్లింల దండయాత్రల సమయంలో ఈ ఊరును " మొహర్" అనిపిలిచేవారని ఆ తర్వాతి కాలంలో "మోరి" గా మారినదని పెద్దలు చెపుతువుంటారు. 11) శ్రీ మహాలక్ష్మి అమ్మవారు., శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు., శ్రీ పుంతలో ముసల్లమ్మతల్లి అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతలు.  12) మలికిపురం సెంటర్ నుండి ఒక కిలో మీటరు దూరంలో మోరి వున్నది. ఆటోలద్వారా  చేరుకోవచ్చును.    నా వివరాలు: పేరు: కటకం వీరభద్రరావు., తండ్రి: సుబ్బారావు గారు., నా ఫోను నంబరు: 9951352407   ఊరితో వున్న అనుబంధం: నేను మోరి లోనే పుట్టి పెరిగినాను.

No comments:

Post a Comment