మిత్రులకు నమస్కారములు.
మనం ఏ పని చేస్తున్నా అంతా ఆ పరమాత్మే చేయిస్తున్నారు, నేను నిమిత్త మాత్రుడిని అనే భావనతో చేయాలి. ఈ పరబ్రహ్మ స్వరూపం ఈ జగత్తును నడిపిస్తున్నారో ఆ పరబ్రహ్మను తలుస్తూ మనం ఈ పని తలపెట్టి చేసినా ఆ పని సఫలీకృతం అవుతుంది. నేను, నాది అనేది ఎమీ లేదు., అంతా మీరే అని పరమాత్మను స్మరించాలి. పరమాత్మ అంటేనే ఒక శక్తి స్వరూపం. మనస్సును లగ్నం చేయటం కోసం మనం ఏదో ఒక రూపంలో ఆరాధిస్తూ ఉంటాము. మనుషులలో ఎన్నో రకాల వారు ఉంటారు. ఎవరికి తోచినట్లు వారు ఆ పరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా మనం మనకు నచ్చిన దేవుని ఆరాధించి ఆత్మ జ్ఞానం పొందాలి.
No comments:
Post a Comment